గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-12-2021 మంగళవారం దినఫలాలు - లక్ష్మీగణపతిని పూజించినట్లైతే?

మేషం :- రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి శ్రమ అధికమవుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి అధికమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు.
 
వృషభం :- వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీ చదువులకు మార్గం సుగమమవుతుంది. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి పంపకాల విషయమై దాయాదులతో ఒప్పందానికి వస్తారు. ఇతరుల క్షేమం కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది.
 
మిధునం :- వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. దైవదర్శనం అతికష్టంమ్మీద అవుతుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కర్కాటకం :- మీ శ్రీమతి శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. అందివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. విమర్శించిన వారే మీ ఔన్యత్యాన్ని గుర్తిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఊహించని చికాకులను ఎదుర్కుంటారు. బంధుమిత్రుల దగ్గర మొహమ్మాటాలకు పోవద్దు.
 
సింహం :- మీ ఉన్నతిపై కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది. మీ బలహీనతలను అదుపులో పెట్టుకోండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆలయాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. భేషజాలకు పోయి విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులతో స్పర్థలు తలెత్తుతాయి.
 
కన్య :- నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తుల బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి.
 
తుల :- సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. బంధు మిత్రులతో స్పర్ధలు తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి.
 
వృశ్చికం :- నష్టాలను భర్తీ చేసుకుంటారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి.
 
ధనస్సు :- ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల అలక్ష్యం తగదు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వృత్తులవారికి సదవకాశాలు లభిస్తాయి. సంతానం గురించి ఆలోచిస్తారు.
 
మకరం :- వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. తొందరపాటుతనం వల్ల నష్టాలు తప్పవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు శుభాకాంక్షలు అందిస్తారు.
 
కుంభం :- ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాం తప్పదని గమనించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పెద్దమొత్తం సహాయం క్షేమం కాదు. సంతానం కదలికలపై శ్రద్ధ వహించండి. తలపెట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. షాపుల అలంకరణతో వ్యాపారాలు ఊపందుకుంటాయి.
 
మీనం :- వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం సేకరిస్తారు. శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు సంభవం. కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి.