ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (19:02 IST)

01-03-2020 నుంచి 31-03-2020 వరకు మీ మాస రాశి ఫలితాలు

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం    
గృహమార్పు కలిసివస్తుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. రుణసమస్యల నుంచి విముక్తులవుతారు. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. బంధుత్వాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. మీ శ్రీమతి విషయంలో మార్పు సంభవం. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ మాసం ఆశాజనకం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరనీ అతిగా విశ్వసించవద్దు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు   
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. మీ సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఆలోచనలు చికాకుపరుస్తారు. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ప్రియతములను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష    
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయ పాలన ప్రధానం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం   
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. వ్యవహారాలతో తీరిక ఉండదు. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. నిర్మాణాలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు   
ఈ మాసం శుభదాయకమే. ప్రేమానుబంధాలు బలపడతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. అకౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. వ్యవహార దక్షతతో రాణిస్తారు. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ప్రత్యర్థుల తీరును గమనించి మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శ్రమ. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ   
సత్కాలం సమీపిస్తోంది. స్వయం కృషితో రాణిస్తారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం   
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు   
ఈ మాసం అనుకూలత ప్రతికూలతల మిశ్రమం. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సమర్థతను చాటుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు   
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. గృహం సందడిగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. ప్రభుత్వ సంబంధిత పనులు సానుకూలమవుతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా వ్యవహరించండి. వాగ్ధాటితో రాణిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.