సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (20:00 IST)

12-01-2020 నుంచి 18-01-2020 వరకు మీ వార రాశి ఫలితాలు.. (Video)

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం   
ఖర్చులు విపరీతం. వేడుకను ఘనంగా చేస్తారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మంగళ, బుధవారాల్లో శకునాలను పట్టించుకోవద్దు. మనోధైర్యంతో అడుగేయండి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పదవులు సభ్యత్వాలు దక్కకపోవచ్చు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ధ్యాస, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థాన చలనం. క్రీడా  పోటీలు, దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు   
ఓర్పుతో వ్యవహరించాలి. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. గురు, శుక్రవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పోటీలు, పందాల్లో రాణిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు   
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. వ్యవహార దక్షతతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది వుండదు. గృహం సందడిగా ఉంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. శనివారం నాడు తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పందాలు ఉల్లాసం కలిగిస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష   
ఆర్థిక లావాదేవీలు ముగింపునకు వస్తాయి. ధనలాభం వుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. చిన్నారులకు కానుకలు అందిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహమార్పు కలిసివస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు  ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రయాణంలో చికాకులెదుర్కుంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఆప్తులకు కలిసివస్తుంది. శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం వుంటుంది. ఖర్చులు అదుపులో వుండవు. వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనివారలతో మంగళ, గురువారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. ఎవరినీ కించపరచవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు కలిసి వస్తుంది. పందాలు, పోటీలు, ఉల్లాసం కలిగిస్తాయి. వాహనం ఇతరులకు ఇవ్వద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. పరిస్థితి అనుకూలత వుంది. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. పత్రాలు అందుకుంటారు. బుధవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు   
ఖర్చులు అంచనాలను మించుతాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గురు, శుక్రవారాల్లో తొందరపడి హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులతో సతమతమవుతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. ఓర్పుతో ఉద్యోగ యత్నం సాగించండి. ప్రకటనలను విశ్వసించవద్దు. ఉద్యోగస్తులకు క్లయింలు, అడ్వాన్స్‌లు మంజూరవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ  
బంధుమిత్రులతో స్పర్థలెదురవుతాయి. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. వాగ్వాదాలకు దిగవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. అభినందనలు, కానుకలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. శనివారం నాడు బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం  
కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. వేడుకల్లో పాల్గొంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. చిన్నారులకు కానుకలు అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. యత్నాలను విరమించుకోవద్దు. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. సన్నిహితుల సలహా పాటించండి. గృహమార్పు కలిసివస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సోమ, మంగళవారాల్లో బాధ్యతలు, పనులు స్వయంగా చూసుకోవాలి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కొంటారు. బెట్టంగులకు పాల్పడవద్దు.
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
వ్యవహార ఒప్పందాల్లో మెలకు వహించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. బాధ్యతగా వ్యవహరించాలి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది వుండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. మంగళ, బుధవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులవుతారు. ఖర్చులు సంతృప్తికరం. పనులు సానుకూలమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకలకు హాజరవుతారు. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. పెట్టుబడులకు సమయం కాదు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఈ వారం అనుకూలతలున్నాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. వేడుకల్లో పాల్గొంటారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. బంధుమిత్రులతో  విభేదాలు తలెత్తుతాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. మీ సమర్థత అధికారులకే లాభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. క్రీడా పోటీల్లో రాణిస్తారు. వాహన చోదకులకు దూకుడు తగదు.