గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (10:25 IST)

నూనెలోని వెల్లుల్లి గుజ్జును కొంచెం అన్నంలో కలుపుకుని...?

చాలామంది కీళ్ళనొప్పులు, నడుము నొప్పులతో తరచుగా బాధపడుతుంటారు. ఇటువంటివారు.. సులువుగా చికిత్సలు చేసుకుంటూ ఉపశమనం పొందవచ్చును. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటి చూర్ణాన్ని త్రికటు చూర్ణం అంటారు. ఈ చూర్ణం ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. దీనిని ఒక చెంచా వరకు తీసుకుని కొంచెం ఉప్పు కలుపుకుని పెరుగులో కలిపి తీసుకుంటే వాతపు వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి తగ్గిపోతుంది.
 
కరక్కాయల లోపలి గింజలు తీసేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 20 గ్రాముల మెత్తని సైంధవ లవణాన్ని కలుపుకుని మజ్జిగతో తీసుకుంటే మలబద్దకం నివారణమవుతుంది. ఒక గ్లాసులో చిక్కటి గంజి తీసుకుని దాంట్లో ఒక చెంచా శొంఠి పొడిని కలిపి కొంచెం ఉప్పు వేసుకుని త్రాగితే కీళ్ళవాతం వారంరోజుల్లో తగ్గిపోతుంది. 
 
100 గ్రాముల వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి చిక్కటి రసం పిండి, కొంచెం నీరు పోసి బాగా దంచి రసం తీసుకుని ముందు తీసిన చిక్కటి రసంలో కలపాలి. దాంట్లో 100 గ్రాముల నూనె కలిపి పొయ్యిమీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నూనెలోని వెల్లుల్లి గుజ్జును కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే కీళ్ళవాతం, పక్షవాతం, మిగతా వాత వ్యాధులన్నీ నివారిస్తాయి.