పచ్చిమిర్చి, టమోటాలు ఉడికించి ఇలా చేస్తే..?

green chilli
Last Updated: మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:57 IST)
కారంతో కళ్లలోనూ, ముక్కులోనూ నీళ్లు తెప్పించే ఒకే ఒక్కటి మిరపకాయ. మిరపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మిరపకాయల్నింటిలో కారం ఇచ్చే రసాయనం కాప్సైసిన్ అనే ఆల్కలాయిడ్. ఈ రసాయనానికి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు మిరపలో కారంతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

4 పచ్చిమిర్చీలను ఓ చిన్న గిన్నెలో వేసి అందులో కొద్దిగా నీరు, 3 చిన్న టమోటాలు వేసి నీరు ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తరువాత వీటిని కొద్దిగా ఉప్పు, చింతపండు, చిన్న ఉల్లిపాయ చేర్చి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో కలిపి తీసుకుంటే ఆ రుచి గురించి అస్సలు చెప్పలేం. ఈ వంటకాలు నోరు చేదుగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది.

కండరాలు తీవ్రంగా నొప్పి పెడుతున్నప్పుడు ఆ బాధ నుండి ఉపశమనం పొందాలంటే.. ఆ ప్రదేశంలో పట్టీలను అతికిస్తారు. ఆ పట్టీలలో రాసే రసాయనం మిరపలోని కాస్పైస్ అనే ఆల్కలాయిడే. కనుక మిరప రుచికి గరంగరంగా ఉన్నప్పటికీ దివ్యౌషధంగా కూడా సహాయపడతుంది.

పచ్చి మిరపకాయలు బాగా తినేవారిలో కొన్ని రకాల వ్యాధులు.. ముఖ్యంగా గుండె జబ్బులు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. పచ్చిమిర్చిలోని రసాయనాలు రక్తనాళాలకుండే సాగిపోయే గుణాన్ని రానీయకుండా కాపాడుతాయి. రక్తనాళాలు బిగుసుపోవడం వలన వచ్చే వ్యాధులు పచ్చిమిరపకాయలు తినేవారికి దరిచేరవు.దీనిపై మరింత చదవండి :