శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:57 IST)

బలపాలు, మట్టి, బియ్యం తింటున్నారంటే... అది వున్నట్లే...

మట్టి తినడాన్ని జనం సాధారణంగా తీసుకుంటారు. మరికొందరైతే ఏముందిలే చిన్న పిల్లలు కదా.. కొన్నిరోజులకు వారే మానేస్తారని చాలా ఈజీగా చెపుతుంటారు. ఇలా చేయడం వలన నష్టం ఏమి లేదా అనేది ప్రశ్న. తప్పకుండా నష్టం జరుగుతుంది. ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల్లో ఎందువలన ఈ లక్షణం వస్తుందనే అంశాన్ని పరిశీలిద్దాం. 
 
మట్టి తినడాన్ని మృద్బక్షణ అని అంటారు. ఇది సాధారణంగా రక్త క్షీణత, అజీర్తి, నులి పాములు, ఏలిక పాములు చిన్నపిల్లల కడుపులో ఉన్నపుడు ఈ లక్షణం వస్తుంది. సుద్ధ, మట్టి, నామసుద్ధ, బలపాలు తినాలనిపిస్తుంది. ఇంతటితో ఆగుతుందా అంటే కానే కాదు. ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దాన్ని నిరోధించేందుకు మందులు వాడాలి.
 
కాచిన సింధూరం 50 గ్రా, కాంతలోహ 50 గ్రాములను తేనెతో కలిపి రెండు పూటలా వేయాలి. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇందులో కూడా తీవ్రత ఉంటుంది. ఏలికపాములు, నులి పురుగులు ఉన్నట్లయితే ఒక్క గ్రాము విడంగాది చూర్ణం, 50 గ్రాముల కాసిన సింధూరం తేనేతో కలిపి రెండు పూటలా తినిపించాలి. పండ్ల రసాలు, మామూలు భోజనం, పౌష్టికాహారం ఇవ్వాలి. సరియైన సమయంలో చికిత్స తీసుకోకుండా ఉంటే పాండు రోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం మంచిది.