శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (16:51 IST)

తాంబూల సేవనం చేయడం ద్వారా దంపతుల మధ్య?

తాంబూల సేవనం చేయడం ద్వారా దంపతుల మధ్య అనురాగం, అన్యోన్యత రెట్టింపు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. 
 
ప్రతి శుభకార్యంలోనూ తమలపాకు తప్పనిసరి. అలాంటి తమలపాకులో గోమాతలా దేవతలు కొలువై వుంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటి. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాల్లో నాటారని చెప్తుంటారు. తమలపాకు సరస్వతీదేవి మధ్యభాగంలో ఉంటుంది. 
 
తమలపాకు చివర్లో మహాలక్ష్మీ దేవి వుంటుంది. తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు. భూమాత తమలపాకుకి కుదిభాగంలో ఉంటుంది. అందుకే తమలపాకుతో శుభకార్యం ప్రారంభిస్తే సర్వమంగళం చేకూరుతుందని విశ్వాసం. 
Beetel, health, Benefits, Marriage, Couple, తాంబూల సేవనం, దంపతులు, అనురాగం, గోమాత