శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (13:46 IST)

తేనెలో అల్లం పేస్ట్ కలిపి తింటే..?

ఈ చలికాలం కారణంగా ఎప్పుడు చూసిన జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువైపోతున్నాయి. వీటి నుండి విముక్తి లభించాలని ఏవేవో మందులు, మాత్రలు వాడుతుంటారు. వీటిని వేసుకున్న కాసేపు బాగానే ఉంటుంది. ఆ తరువాత సమస్య మొదటికే చేరుతుంది. మళ్లీ దీనికోసం ఆందోళన మొదలవుతుంది. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం..
 
1. నీటిని బాగా మరిగించుకుని అందులో 2 స్పూన్ల దాల్చినచెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత తాగాలి. ఇలా ప్రతిరోజూ క్రమంగా చేస్తే జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది.
 
2. తులసి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, ఇన్‌ఫెక్షన్స్ వంటి గుణాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. దాంతోపాటు రోగనిరోధకశక్తిని కూడా పెంచుతాయి. కప్పు తులసి ఆకులను తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆపై నీటిని ఈ ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి. అనంతరం ఈ నీటిని తాగితే జ్వరం తగ్గుతుంది.
 
3. తేనె అంటే నచ్చని వారుండరు. కాబట్టి తేనెలో కొద్దిగా అల్లం పేస్ట్ కలిపి 1 స్పూన్ మోతాదులో రోజుకు ఒక్కసారి తింటే.. శరీర రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా.. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాల నుండి విముక్తి లభిస్తుంది.
 
4. స్పూన్ ఆవనూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేసి పాదాలకు రాసుకోవాలి. జ్వరంతో బాధపడేవారు రాత్రివేళ ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే.. ఉదయానికంతా జ్వరం తగ్గిపోతుంది.
 
5. ఓ చిన్న పాత్రలో గ్లాస్ నీరు పోసి అందులో 2 స్పూన్ల ధనియాల పొడి కొద్దిగా తేనె వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా తయారైన మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే.. కషాయం రూపంలో తీసుకుంటే జ్వరం నుండి తక్షణమే విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.