శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (13:29 IST)

మెంతి పొడిలో నిమ్మరసం కలిపి సేవిస్తే..?

స్త్రీలు రుతు సమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. వాటిని తగిన వైద్య చికిత్సలు కూడా చేయించుకుంటారు. రకరకాల మందులు, టానిక్‌లు వాడుతుంటారు. వీటి వాడకం వలన సమస్య మరింత పెరుగుతుందే కానీ తగ్గే అవకాశాలేవని చెప్తున్నారు. మెంతులు మహిళల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. మెంతుల్లోని న్యూట్రియన్స్ శరీర ఒత్తిడి, బలహీనతను తొలగిస్తాయి.
 
1. మెంతులలో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. ఆ తరువాత శుభ్రం చేసి పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా జీలకర్ర, చింతచిగురు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. స్త్రీలకు ఆ సమస్యలు తొలగిపోతాయి. 
 
2. మెంతులు ఎండబెట్టి పొడిచేసి అందులో కొద్దిగా పెరుగు, తేనె కలిపి సేవిస్తే నొప్పి తగ్గుతుంది. ఈ పొడిని గ్లాస్ పాలలో కలిపి తాగితే కూడా అలాంటి నొప్పులు వెంటనే తగ్గుతాయి. 
 
3. స్త్రీలకు ఆ సమయంలో నొప్పుల కారణంగా తలనొప్పి, వాంతులు వచ్చే అవకాశాలున్నాయి. అందుకు ఏం చేయాలంటే.. మెంతి గింజలను వాసన పీల్చుకుంటే సమస్య పోతుంది. 
 
4. ప్రతిరోజూ తయారుచేసుకునే వంటకాల్లో కొద్దిగా మెంతి పొడి తీసుకుంటే శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు తొలిగిపోతాయి. మెంతుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. 
 
5. మెంతులు జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా ఉపయోగపడుతాయి. మెంతి పొడితో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి సేవిస్తే కడుపు నొప్పి తగ్గుముఖం పడుతుంది. మెంతులు కంటి చూపును మెరుగుపరచుటకు చక్కగా పనిచేస్తాయి.