శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (17:21 IST)

ఆరోగ్యానికి.. ఆయుర్వేద వైద్య సూత్రాలు...?

శరీరంలోని వాత, పిత్త, కఫ, దోషాలు, అగ్ని, ధాతువులు ప్రసన్నమైన మనస్సు, ఆత్మ, ఇంద్రియాలు అన్ని సమంగా ఉన్నావారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు. ఇవి సమంగా ఉంచుకోవడానికి పనికి వచ్చే అన్నిరకాల సూత్రాలను వివరించడం ఆయుర్వేదంలో ఉంది. మానవులలో నాడి - పురుషులలో కుడిచేతి యొక్క బొటనవ్రేలి మూలాభాగానికి క్రిందన, స్త్రీలలోనైతే - ఎడమచేతి బొటనవ్రేలి మూలభాగం క్రిందన స్పష్టంగా తెలుస్తుంది..
 
1. వైద్యుడు నాడి పరీక్షించేటపుడు.. రోగి యొక్క మోచేతి కొద్దిగా ఒంచి, వేళ్ళను వెడల్పుగా, బిగదీయకుండా ఉండేట్లు చేసి పరీక్షించాలి. నాడీ పరీక్షను ఉదయకాలంలో చేయుటవలన.. మంచి ఫలితాలు కలుగుతాయి.
 
2. రోగి యొక్క నాడిని ముందు కొన్నిసార్లు పట్టి విడుస్తూ బుద్దికుశలతతో వ్యాధి నిర్ణయం చేయాలి. మొదటి సారి నాడీ గమనం వాతరోగములను తెలియజేస్తుంది. రెండవసారి.. నాడీ గమనం పిత్త రోగ దోషములను తెలియజేస్తుంది. మూడవసారి నాడీ గమనం శ్లేష్మరోగ దోషములను తెలియజేస్తుంది. కాబట్టి మూడుసార్లు నాడీ పరీక్ష చేయడం వలన ఈ మూడు రకాల వ్యాధులను తెలుసుకోవలసి ఉంటుంది. 
 
3. వాతరోగములు కలిగివుంటే.. నాడి.. పాము, జలగ లాగా ప్రాకు చున్నట్లు తెలుస్తుంది. పిత్త రోగములు కలిగివుంటే.. కప్పలా ఎగురుతున్నట్టుగా తెలుస్తుంది. శ్లేష్మరోగములు కలిగివుంటే.. హంస, నెమలి మాదిరిగా మందకొడిగా, నిదానంగా తెలుస్తుంది.
 
4. నాడీ పరీక్ష చేసేటపుడు.. నాడి ప్రాకుతున్నట్లు గెంతుతున్నట్లు ఎక్కువగా కదలికలను తెలియజేస్తే.. వాత, పిత్త వ్యాధులు రెండు కలవిగా గుర్తించాలి. నాడీ పరీక్షలో.. ఎక్కువసార్లు నాడి ప్రాకుతున్నట్లు, మందకొడిగా రెండు విధాలుగా కదలికలు తెలిపితే.. పిత్త, శ్లేష్మ వ్యాధులు రెండూ కలిసివున్నట్లు గ్రహించాలి.