మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : శనివారం, 7 జులై 2018 (16:31 IST)

అరటి ఆకుల్లో భోజనం చేస్తే?

అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి ఆకుల్లో సహజ సిద్ధమైన కార్బన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో భోజనం చేస్తే ఈ సహజ కార్బన్ సమ్మేళనాలు శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్

అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి ఆకుల్లో సహజ సిద్ధమైన కార్బన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో భోజనం చేస్తే ఈ సహజ కార్బన్ సమ్మేళనాలు శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులను నివారిస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.
 
అరటి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుటలో సహాయపడుతుంది. సూక్ష్మ జీవులను నాశనం చేస్తుంది.  అరటి  ఆకులలో భోజనం చేయడం వలన ప్లేగుల్లోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అరటి చెట్టు నుంచి వచ్చే అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
అరటి పండులోని పొటాషియం శరీర కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను కూడా అరికట్టడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది.  అరటిపండు అల్సర్లను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది.