తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే... (వీడియో)

శుక్రవారం, 6 జులై 2018 (10:32 IST)

చాలా మందికి చిన్నవయసులోనే వెంట్రుకలు తెల్లగా మారిపోతుంటాయి. దీంతో జట్టుకు నల్లరంగు వేసుకుంటారు. నిజానికి ఇలా తెల్ల వెంట్రుకలతో బాధపడేవారు చిన్నపాటి చిట్కాలను పాటిస్తే వెంట్రులకు నల్లగా మారే అవకాశం ఉంది. ఆ చిట్కాలు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
white hair
 
* జుట్టుకు రంగు వేసుకోవాలంటే మొదటగా ఠక్కున గుర్తుకొచ్చేది హెన్నా. హెన్నా పౌడర్‌ని ఆముదంలో మరిగించాలి. చల్లబడ్డాక దాన్ని జుట్టు కుదుళ్లకు అంటేలా రాయాలి. 2 గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. 
 
* బ్లాక్ టీతో కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. బ్లాక్ టీ పొడిని నీటిలో మరిగించి గోరువెచ్చగా అయ్యాక తలకు రాసి గంట తర్వాత తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
 
* రాత్రి పడుకునే ముందు ఉసిరికాయ, కుంకుడుకాయ, శీకాకాయల మిశ్రమాన్ని బాగా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే దాంట్లో మైదాకు కలిపి మరో 2 గంటలు నానబెట్టాలి. ఆ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత బాగా రుద్ది స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్ల వెంట్రుకలు వెంట్రుకలు నల్లగా మారి బలంగా, ఒత్తుగా పెరుగుతాయి.
 
* కాఫీతోనూ తెల్ల జుట్టును కవర్ చేయొచ్చు. రెండు టేబుల్‌స్పూన్ల కాఫీ పొడిని కప్పు నీటిలో మరిగించాలి. చల్లారాక స్ప్రే బాటిల్‌లో పోసి జుట్టు కుదుళ్లపై చల్లాలి. తర్వాత మసాజ్ చేసి గంటపాటు షవర్‌క్యాప్ ధరించాలి. తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. 
 
* వాల్‌నట్లను నలిపి అరగంటసేపు నీటిలో మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత కాటన్ బాల్ సాయంతో జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసాన్ని త్రాగితే?

ఉదయం లేవగానే గోరు వెచ్చటి నిమ్మరసాన్ని తాగడం ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీలకు బదులు ...

news

ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహార పదార్థాలు.. బట్టతల, ఒబిసిటీ తప్పదా?

పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నా.. పెద్దలు కార్యాలయాలు వెళ్తున్నా, అల్పాహారం, భోజనం ...

news

ఒకరు తిని విడిచిపెట్టిన బిర్యానీని ఇంకొకరికి వడ్డిస్తే ఎలా వుంటుంది?

నల్లగొండ జిల్లాలోని హోటళ్లలో కుళ్లిన చికెన్, పాచిపోయిన బిర్యానీ వడ్డిస్తున్నారట. ఈ ...

news

రాత్రి భోజనం అనంతరం ఒక స్పూన్ ఉసిరి పొడిలో తేనెను కలిపి...

జ్ఞాపకశక్తి అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. ఇటీవల కాలంలోమనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ...