మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (09:36 IST)

జుట్టు రాలకుండా వుండాలంటే.. అరటి పండ్లు, బాదం ఆయిల్?

జుట్టు రాలకుండా వుండాలంటే.. అరటి పండ్లు, బాదం ఆయిల్ ఎంతో మేలు చేస్తాయి. బాగా పండిన రెండు అరటిపండ్లు, ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని అన్నీ మి

జుట్టు రాలకుండా వుండాలంటే.. అరటి పండ్లు, బాదం ఆయిల్ ఎంతో మేలు చేస్తాయి. బాగా పండిన రెండు అరటిపండ్లు, ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని అన్నీ మిక్స్ చేయాలి. వీటిని స్మూత్ పేస్టులా చేసుకుని.. తలకు మాస్క్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దీంతో జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది. జుట్టు మృదువుగా మారుతుంది. చుండ్రు తగ్గిపోతుంది. 
 
అలాగే ఒక కప్పు పాలలో ఓ కోడిగుడ్డు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా మిక్స్ చేసుకుని తలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం వుంటుంది. దీనివల్ల జుట్టుకు మంచి షైనింగ్ పోషణ అందుతుంది. తద్వారా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.  
 
ఒక కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనెలను ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. దీని వల్ల జుట్టుకు తగిన మాయిశ్చరైజర్, పోషణ అందుతాయి. జుట్టుకు బలం చేకూరుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు.