ఆహారం జీర్ణం కావడం లేదా.. అయితే, ఇలా చేయండి...

శుక్రవారం, 15 జూన్ 2018 (11:52 IST)

చాలా మందికి తిన్న ఆహారం సరిగా జీర్ణంకాదు. ఈ సమస్యకు ప్రధాన కారణం అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలేనని వైద్య నిపుణులు చెపుతున్నారు. అలాగే వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంటుంది. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెపుతున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
Indigestion
 
* అజీర్ణ సమస్యకు చక్కటి పరిష్కారం అల్లం. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. అనంతరం అల్లంలో ఉండే సారం ఆ నీటిలోకి చేరుతుంది. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల తిన్న ఆహారం జీర్ణమవుతుందట. అలాగే, అల్లం ముక్కలను దంచి రసం తీసి ఆ రసాన్ని సేవించినా కూడా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెపుతున్నారు.
 
* ఒక గ్లాసుడు నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగితే అజీర్ణ సమస్య మాయమైపోతుంది. అవసరం అనుకుంటే ఆ మిశ్రమంలో తేనె కూడా కలుపుకోవచ్చు.
 
* చల్లటి పాలు కడుపులోని ఆమ్లాలను తటస్థం చేయడానికి, అజీర్ణం చికిత్సకు కూడా సహాయపడుతుంది. కొవ్వు రహిత పాలు ఒక కప్పు చొప్పున రోజులో రెండుసార్లు తాగితే అజీర్ణ సమస్యకు ఉపశమనం లభిస్తుంది. 
 
* ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి తాగితే అజీర్ణ సమస్య బాధించదు. నీటికి బదులుగా తేనె, నిమ్మరసంలను కూడా ఉపయోగించవచ్చు.
 
* ఒక గ్లాస్ నీటిలో కొన్ని సోంపు గింజలను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
 
* గుప్పెడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తినాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్య గణనీయంగా తగ్గిపోతుంది. 
 
* ఒక కప్పు వేడి నీటిలో కొద్దిగా తులసి ఆకులను వేసి 10 నిముషాలవరకు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని గోరువెచ్చగా చల్లబరిచి దానికి కొద్దిగా తేనె కలిపి సేవించాలి. ఇలా రెండు మూడు సార్లుగా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనిపై మరింత చదవండి :  
అజీర్ణం గృహ చిట్కాలు హెల్త్ టిప్స్ Indigestion Health Tips Natural Home Remedies

Loading comments ...

ఆరోగ్యం

news

ఒబిసిటీకి జీలకర్ర దివ్యౌషధం.. పెరుగు, మజ్జిగలో కలిపి తీసుకుంటే?

ఒబిసిటీకి జీలకర్ర దివ్యౌషధంగా పనిచేస్తుంది. గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే ...

news

కంద దుంపలను తింటే పురుషులకు ఏమవుతుందో తెలుసా?

మనం నిత్యం వాడే దుంపకూరలలో కంద గడ్డలకు ప్రత్యేకస్ధానం ఉంది. ఇది అనేక రకములైన పోషక ...

news

బక్కపలుచగా ఉన్నారా... అయితే ఈ చిట్కాలు మీ కోసం...

కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగానే ఉంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేనివారు కూడా ...

news

రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్‌ని స్ప్రే చేస్తే...

గులాబి చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. గులాబీని ఇష్టపడని వారుండరు. గులాబి ...