శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (09:45 IST)

గ్రీన్ టీలో కలబంద గుజ్జు కలిపి తీసుకుంటే...

చాలామంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఇలాంటివారు బరువు తగ్గేందుకు రోజుల కొద్దీ పస్తులుంటారు. మరికొందరు డైటింగ్‌లో పేరుతో తిండిమానేసి అనారోగ్యం పాలవుతుంటారు. కానీ, అధిక బరువుతో బాధపడేవారు గ్రీన్‌లో కలబం

చాలామంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఇలాంటివారు బరువు తగ్గేందుకు రోజుల కొద్దీ పస్తులుంటారు. మరికొందరు డైటింగ్‌లో పేరుతో తిండిమానేసి అనారోగ్యం పాలవుతుంటారు. కానీ, అధిక బరువుతో బాధపడేవారు గ్రీన్‌లో కలబంద గుజ్జు(మిక్సీలో వేసి గ్రైండ్ చేసింది)ను కలిపి తీసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోతారని గృహవైద్య నిపుణులు చెపుతున్నారు. నిజంగా చెప్పాలంటే అలోవెరాతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెల్సిందే. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
* ప్రతి రోజూ ఉదయం లేదా రాత్రి వేళల్లో గ్రీన్ టీలో కొద్దిగా క‌ల‌బంద గుజ్జు క‌లిపి తాగితే అధిక బ‌రువు ఇట్టే త‌గ్గిపోతుంది. 
* రోజుకు రెండు పూటలా కొద్దిగా క‌ల‌బంద ర‌సం తీసుకుని దాన్ని స్ట్రాబెర్రీ పండ్ల‌తో క‌లిపి తినాలి. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు వేగంగా క‌రుగుతుంది. ఫలితంగా అధిక బ‌రువును కోల్పోతారు. 
 
* ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక క‌ప్పు నీటిని తీసుకుని అందులో కొద్దిగా క‌ల‌బంద‌, అల్లం ర‌సం క‌లిపి ఆ నీటిని కొద్దిగా వేడి చేసి తాగాలి. దీంతో ఒంట్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. ఈ చిట్కాతో త్వరితగతిన అధిక బ‌రువును కోల్పోతారు.
* క‌ల‌బంద ర‌సాన్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగినా చాలు, ఫ‌లితం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.