శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : గురువారం, 19 జులై 2018 (18:30 IST)

కొబ్బరి పాలు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు?

రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోల్డెన్ మిల్క్ తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, చర్మవ్యాధులను నివారించేందుకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదంలోనూ వివరించారు.

ఒకగ్లాసు కొబ్బరి పాలు తీసుకుని అందులో చెంచా పసుపు, తేనె, నెయ్యి, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలుపుకుని త్రాగితే ఆరోగ్యానికి మంచిది. కీళ్లనొప్పులు, వాపు వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. అజీర్తి, ఛాతీలో మంట వంటివి తగ్గుతాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
 
ఇన్సులిన్ స్థాయిలు తగినంత ఉండేలా చేస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరకుండా చూస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పాలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ పైరెటిక్ గుణాలుంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి. జీవక్రియల పనితీరు పెరుగుతుంది. దీని ఫలితంగా అదనపు బరువు తగ్గుతారు. క్యాన్సర్ వ్యాధులు దరిచేరవు.