తాగితే.. రాగి చెంబు లేదా మట్టికుండలోని నీటినే తాగాలి..
రాగి చెంబు, రాగి పాత్రలను ఉపయోగించడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. రాగి చెంబులోని నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇ-కోలి బ్యాక్టీరియాను నశింపచేసే గుణం రాగిలోహానికి వుండటం చేత రాగి పాత్రలను ఉపయోగించి.. ఆరోగ్యానికి మేలు చేకూర్చుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
పసిడికి కూడా ఇ-కోలీ బ్యాక్టీరియాను నశింపజేసే గుణం లేదు. ఇకపోతే రాగి పాత్రలో వుంచిన నీరు స్వచ్ఛంగా వుంటాయి. ఆ నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అల్యూమినియం పాత్రలను ఉపయోగించడం ద్వారా కీళ్ల నొప్పులు ఏర్పడుతున్నాయి. స్టీల్, అల్యూమినియం పాత్రల్లో నీటిని నింపి తాగడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు.
అయితే రాగి పాత్రలో నిల్వ వుంటే నీటిని తాగడం ద్వారా కీళ్లనొప్పులు మాయమవుతాయి. అలాగే మట్టి కుండల్లో ఆహారం వండుకుని తినడం చేస్తే వాత సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చు. గర్భిణీ మహిళలు మట్టికుండల్లో నీటిని సేవించడం ద్వారా అలెర్జీలు దూరమవుతాయి. మట్టికుండల్లో వుండే యాంటీ-యాక్సిడెండ్లు క్యాన్సర్ కారకాలను నశింపజేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Copper vessel, water, Health, pot, e-coli bacteria, steel, alumium, రాగి చెంబు, మట్టి కుండలు, థైరాయిడ్, క్యాన్సర్