శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (16:35 IST)

ఆకలి బాగా వేయాలంటే...

చాలా మందికి ఆకలి వేయదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పస్తులుంటారు. ఇంట్లోని వారు ఎంత చెప్పినా భోజనం చేసేందుకు ససేమిరా అంటుంటారు. దీనివల్ల నీరసం, అలసట వస్తున్నాయి. అనారోగ్యం బారినపడుతుంటారు. ఇలాంటివారు ఇంటిపట్టునే చిన్నపాటి పెరటి చిట్కాలు పాటిస్తే ఆకలి బాగా అవుతుంది. ఆ పెరటి చిట్కాలేంటో పరిశీలిద్ధాం.
 
* ఆకలి వేయాలంటే ఒక టీ స్పూన్‌ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిసి పది రోజుల పాటు భోజనానికి అర్థగం ముందు తీసుకున్నట్టయితే ఆకలి బాగా వేస్తుంది. 
 
* ఒక టీ స్పూన్ బెల్లంపొడి, అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని కలుపుకుని ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఏదో ఒక పూట తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది. 
 
* ప్రతిరోజూ భోజనానికి ముందు రెండు లేదా మూడు యాలకుల గింజలను నిమిలి మింగాలి. దీంతో మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడమే కాదు ఆకలి కూడా బాగా వేస్తుంది. 
 
* ఒక కప్పులో నీటిని తీసుకుని అందులో ఉసిరిక్కాయ రసం, నిమ్మరసం, తేనెలను కలుపుకుని రోజుకు 2 టీ స్పూన్ల చొప్పున ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకున్నట్టయితే ఆకలి బాగా వేస్తుంది. 
 
* నిమ్మరసంలో వామును కలిపి ఎండలో పెట్టాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి నల్ల ఉప్పును కలిపి ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఆకలి దంచేయడం.