శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By సందీప్
Last Updated : గురువారం, 23 మే 2019 (18:24 IST)

సిగరెట్ తాగితే అంగంపై ప్రభావం...

ధూమపానం ఎన్నో ఇబ్బందులను కలిగిస్తుందని మనకు తెలుసు. ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది. సిగరెట్లు తాగితే లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుందట. అంగం సరిగ్గా స్తంభించకపోవడం, అంగం కుంచించుకుపోయి పరిమాణం తగ్గడం వంటివి జరుగుతుంది. అంగంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగితేనే అది స్తంభిస్తుంది. 
 
అయితే ధూమపానం చేసేవారి రక్తం నాళాల్లో అథెరోస్క్లెరోసిస్ (ధమనుల గోడలపై కొవ్వులాంటి పదార్థాలు) ఎక్కువగా ఉంటుంది. అవి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. సిగరెట్‌లో ఉండే రసాయనాలు కూడా అంగంపై దుష్ప్రభావం చూపుతాయి. అందులో ఉండే నికోటిన్ వల్ల రక్తనాళాలు సన్నగా మారిపోతాయి. తాత్కాలికంగా లేదా శాశ్వతంగానైనా ఈ ముప్పు ఉండవచ్చు. 
 
ఈ కారణంగానే స్మోకింగ్ చేసే వారిలో అంగం కుంచించుకుపోతుంది. అంగ స్తంభన కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. రక్త సరఫరా తగ్గిపోగానే అంగం పరిమాణం చిన్నదైపోతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉన్నప్పుడే అంగం గట్టిపడి పొడవుగా ఉంటుంది. 
 
ధూమపానం చేసే స్త్రీలలో కూడా లైంగిక సమస్య ఏర్పడుతుందని అధ్యయనాలలో తేలింది. వారు ప్రేరేపించబడాలంటే వారి అంగంలో కూడా రక్త ప్రసరణ అవసరం. అలా లేకపోతే తృప్తి చెందడం కష్టం అని వైద్యులు చెబుతున్నారు.