సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 21 మే 2019 (15:46 IST)

రెటీనా దెబ్బతింటే కంటి చూపు..?

రెటీనా దెబ్బతింటే కంటి చూపు మందగిస్తుందని మనకు తెలుసు, అలాగే రెటీనా దెబ్బతిన్న వారిలో కొంత మందికి మతిమరుపు కూడా ఉంటోందని గుర్తించారు పరిశోధకులు. ఇటీవల ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. దెబ్బ తిన్న రెటీనా ఆధారంగా వ్యక్తికి మతిమరుపు (డిమెన్షియా) సమస్య ఉన్నట్లు తేల్చవచ్చంటున్నారు. 
 
రెటీనాలోని రక్తనాళాలు దెబ్బ తినడం అనేది వారిలో మతిమరుపు వ్యాధికి సంకేతంగా కూడా భావించాలని వారంటున్నారు. పరిశోధకులు కొంత మంది ఇటీవల 69 నుంచి 97 మధ్య వయస్సు ఉన్న వారిని పరిశీలించారు. వీరిలో 50 శాతం కంటే ఎక్కువ మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు వలన కంటిలోని రెటీనా దెబ్బతింటుంటుంది. 
 
అయితే ఈ సమస్య అంతటితో పరిమితం కాదు. ఇలా కంట్లోని రక్తనాళాలు దెబ్బ తిన్న వారి కేంద్రనాడీ వ్యవస్థలోనూ అంటే మెదడులోనూ కొన్ని సమస్యలు ఉంటాయనే మరో నిజం కూడా ఈ సందర్భంగా బయటపడింది. దీని వల్ల కలిగే దుష్ప్రభావం ఏమిటంటే, వీరికి మతిమరుపు వ్యాధి కూడా ఉంటుంది. అందుకే కంటి సమస్యలు తలెత్తిన వారు న్యూరాలజిస్ట్‌ని కూడా సంప్రదించి పరీక్ష చేయించుకోవాలంటున్నారు నిపుణులు.