శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జులై 2020 (20:15 IST)

కరోనా వేళ.. జామ ఆకుల టీని రోజూ తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..? (video)

Guava tea
ప్రపంచ దేశాలను కరోనా అట్టుడికిస్తోంది. జనాలు కరోనా అంటేనే జడుసుకుంటున్నారు. కరోనా బారిన పడకుండా వుండేందుకు వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. ఇంకా ఆయుర్వేదంపై మొగ్గుచూపుతున్నారు. అలాంటి వాటిలో జామ ఆకులు కూడా ఒకటి. జామ ఆకుల్లో బ్యాక్టీరియాలను నశింపజేసే గుణాలున్నాయి. అజీర్తి సమస్యలను ఇవి తొలగిస్తాయి. 
 
అలాగే దంత సమస్యలను తొలగిస్తాయి. నోటిని శుభ్రంగా వుంచుతాయి. గొంతు, ముక్కు సంబంధిత రుగ్మతలను పటాపంచలు చేస్తాయి. అలాంటి జామ ఆకులను నోటిలో వేసి నమలం ద్వారా లేకుంటే జామ ఆకులతో టీ తయారు చేసి తీసుకోవడం ద్వారా దంత సమస్యలు వుండవు. నోటిపూత తొలగిపోతుంది. గొంతులో కిచ్ కిచ్ వుండదు. 
 
ఇంకా చెప్పాలంటే.. ఒబిసిటీకి జామ ఆకుల టీ ఎంతో మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తొలగిస్తుంది. జామ ఆకులు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. హృద్రోగ సమస్యలను దరిచేరనివ్వవు. దగ్గు, జలుబును దూరం చేసే శక్తి జామ ఆకులకు వుంది. జామ ఆకులను రోజూ కషాయంలా తీసుకుంటే మహిళలు నెలసరి సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. ఒక గుప్పెడు జామ ఆకులను తీసుకోవాలి. 
 
జామ ఆకులను ఎండబెట్టి లేదంటే అలాగే నీటిలో మరిగించి.. టీ లేదంటే కషాయంలా 12 వారాల పాటు తాగితే.. రక్తంలోని చక్కెర స్థాయులు తగ్గిపోతాయి. తద్వారా మధుమేహం దూరం అవుతుంది. 
 
8 జామ ఆకులను ఒకటిన్నర లీటరు నీటిలో మరిగించి.. వడగట్టి రోజూ మూడు సార్లు తీసుకుంటే.. ఉదర సంబంధిత రుగ్మతలు వుండవు. జామ ఆకుల రసాన్ని తీసుకుని.. అందులో రెండు స్పూన్ల తేనె కలుపుకుని రోజూ తీసుకుంటే.. బరువు సులభంగా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.