శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (10:15 IST)

దాల్చిన చెక్క పొడి, వెల్లుల్లితో ఆ సమస్య రాదు..?

చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యల వలన పలురకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. జలుబు, దగ్గు. ఈ రెండు సమస్యలు వచ్చాయంటే చాలు.. గొంతునొప్పిగా, గొంతు గరగరగా ఉంటుంది. దాంతో పాటు తలనొప్పి తీవ్రంగా వస్తుంది. ఈ సమస్యల నుండి విముక్తి చెందుటకు ఏవేవో మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి ఫలితాలు కనిపించవు. వీటికి చెక్ పెట్టాలంటే.. ఇంట్లోని కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.. అవేంటో చూద్దాం..
 
1. దాల్చిన చెక్క వేయించి పొడి చేసుకుని అందులో కొద్దిగా మిరియాల పొడి గోరువెచ్చని పాలు కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
 
2. గ్లాస్ పాలలో కొద్దిగా పసుపు, దాల్చిన చెక్క పొడి వేసి సేవిస్తే గొంతు గరగర తగ్గుతుంది. దాల్చిన చెక్కలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ సమస్యల నుండి త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తాయి. 
 
3. వెల్లుల్లిని మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం కలిపి కాసేపు నూనెలో వేయించి వేడి వేడి అన్నంలో కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి సేవిస్తే కూడా ఆ సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
4. దాల్చిన చెక్కను కాసేపు నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జలుబు దగ్గుతుంది. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే సేవిస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. 
 
5. అరకప్పు వేనీళ్లలో కొద్దిగా శొంఠి పొడి, నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి నోటిని పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే చిగుళ్ల సమస్యలు తొలగిపోతాయి. దాంతో దంతాలు దృఢంగా మారుతాయి.