Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వర్షాకాలంలో శొంఠి చేసే మేలు

శనివారం, 11 నవంబరు 2017 (11:14 IST)

Widgets Magazine

శొంఠిని నేతితో వేయించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మొదటి ముద్ద అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలు, పొట్టలో వికారం వంటివి అన్నీ తొలగిపోతాయి. శొంఠి ఆకలిని పెంచుతుంది. జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది. అల్లం తాగడం ద్వారా అజీర్తి తగ్గుతుంది. అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది. 
 
గర్భిణీల్లో తలతిరగడం, వికారం, వేవిళ్లు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది. వర్షాకాలం జలుబూ, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది. 
 
జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే శొంఠి పొడికి చిటికెడు బెల్లం ముక్క కలిపి రోజూ రెండు మూడు సార్లు తినాలి. అలాగే చెంచా శొంఠి పొడికి చిటికెడు లవంగాల పొడి, ఉప్పు ఒకటిన్నర కప్పు నీటిలో వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించవచ్చు. 
 
వేడి అన్నంలో శొంఠి పొడిని, పప్పునూనెను కలిపి ప్రతీ రోజూ మొదటి ముద్దగా తింటే అజీర్తి పోయి ఆకలి పెరుగుతుంది. అలాగే పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి, అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు, బరువూ అదుపులో ఉంటుంది. ఈ పొడిని వేడి పాలల్లో వేసుకుని, చిటికెడు చక్కెర కూడా కలిపి తాగితే మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నడుం నొప్పి వేధిస్తే ఇలా చేయండి..

గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? నడుం నొప్పి వేధిస్తుందా? అయితే గోరువెచ్చటి ...

news

కస్తూరి పసుపులో వున్న మేలెంత? (video)

కస్తూరి పసుపులో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కస్తూరి ...

news

రోగం రానివ్వని ఆహార పదార్థాలు... ఏంటవి?

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన శరీరముంటే ఏ పనైనా సాధించవచ్చు. ఆరోగ్యానికి మూలం మన రోగ ...

news

గోంగూర పువ్వులతో ఇన్ఫెక్షన్లకు చెక్

శరీరంలో నీటి శాతం తగ్గడం.. మలినాలు శరీరంలోనే నిలిచిపోవడం.. ద్వారా ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో ...

Widgets Magazine