శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (16:36 IST)

ఉల్లిపాయ రసం, ఉప్పు కలిపి తీసుకుంటే..?

ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదని చెప్తుంటారు. ఉల్లిపాయలేని వంటకం అంటూ లేదు. ఇటువంటి ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం.. ఉబ్బస వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఇలా చేస్తే.. ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.
 
అజీర్తి సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయ రసంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని తీసుకుంటే సమస్య తొలగిపోతుంది. చాలామంది పంటి నొప్పులతో బాధపడుతుంటారు.. అలాంటప్పుడు ఉల్లిపాయను పంటిపై పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయను రోజూ వారి ఆహారంగా తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు గలవారు ఉల్లిపాయ రసంలో కొద్దిగా నిమ్మరసం, చక్కెర కలిపి తీసుకుంటే మంచిది. 
 
గర్భిణులకు వాంతులు ఎక్కువగా వస్తుంటాయి. వారు ఇలా చేస్తే.. ఉల్లిపాయ ముక్కకు ఉప్పు రాసుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ రసంతో కీళ్ళపై మర్దన చేసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఉల్లిపాయను పేస్ట్‌లా చేసుకుని నుదుటిపై రాసుకోవాలి. ఇలా చేయడం వలన తలనొప్పి తగ్గుతుంది. శరీరంలోని కొవ్వును తొలగిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుటలో ఉల్లిపాయకు మించిన వైద్యం మరొకటి లేదు.