శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (15:30 IST)

ఉల్లిపాయలు కట్ చేస్తున్నారా.. ఇలా చేస్తే..?

ఉల్లిపాయ లేని కూర అంటూ ఉండదు. ఇది లేకుండా కూర చెయ్యడానికి కూడా ఇష్టపడరు. కానీ వాటిని తరిగేటప్పుడు కష్టపడుతుంటారు. చాలామంది ఉల్లిపాయలను కట్‌‌చేసేటప్పుడు కంటి నుంచి నీరు కారుతుంటారు. అందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. మరి అవేంటో చూద్దాం.. రండీ రండీ..
 
1. ఉల్లిపాయలను తరిగేముందు వాటిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టడం వలన ఉల్లిపాయల్లోని రసాయనాలు గడ్డకడుతాయి. దాంతో వీటిని కట్‌చేసేటప్పుడు కంటి నుండి నీరు రావు. 
 
2. ఉల్లిపాయలను తరిగే ప్రాంతంలో కొవ్వొత్తిని వెలిగించినా లేదా మండుతున్న గ్యాస్ దగ్గరగా నిలబడి కోసినా కళ్లు మండే అకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 
 
3. ఉల్లిపాయలను కోసిన వెంటనే గిన్నెలో వేయకుండా చాపింగ్ బోర్డ్ మీదే ఉంచాలి. అప్పుడే దానిలోని రసాయనాలు తక్కువగా విడుదలవుతాయి. దాంతో కంటి నుండి నీరు రావు.
 
4. ఓ గిన్నెలో సగానికి నీళ్లు పోసుకుని ఆ నీటిలో ఉల్లిపాయలు వేసి అరగంట పాటు అలానే ఉంచి కట్ చేసుకుంటే కంట్లో నీరు రావు. 
 
5. గాలి బాగా ప్రసరించే ప్రాంతాల్లో ఉల్లిపాయలను కట్ చేయాలి. అంటే.. ఫ్యాన్ కింది, వంటగదిలో ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ దగ్గరలో నిల్చుకోకుండా కట్ చేసుకుంటే కంటి మంటలు తగ్గుతాయి.