మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (14:24 IST)

ఓట్స్, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

ఓట్స్ పిల్లల ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అందానికి కూడా అంత మంచిది. మరి ఈ ఓట్స్‌తో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. ఓట్స్‌ను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.
 
నారింజ తొక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా పాలు, తేనె, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. ప్రతిరోజూ నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడిగేసుకుంటే ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
తేనెలో పెరుగు, ఉప్పు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. చక్కెరలో కొద్దిగా బంగాళాదుంప రసం కలిపి ముఖానికి, మెదడు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.