శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (13:11 IST)

తామర రేకులతో టీ తాగితే..?

తామర పువ్వు పవిత్ర పూజా పుష్పం. ఇది పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తామరపువ్వుల్లోని కాడలను విదేశాల్లో ఆహారాల్లో ఉపయోగిస్తారు. ఇక తామర గింజలను కూరలతో పాటు.. పిండి కొట్టుకుని కేక

తామర పువ్వు పవిత్ర పూజా పుష్పం. ఇది పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తామరపువ్వుల్లోని కాడలను విదేశాల్లో ఆహారాల్లో ఉపయోగిస్తారు. ఇక తామర గింజలను కూరలతో పాటు.. పిండి కొట్టుకుని కేకులు, ఐస్‌క్రీముల్లో అధికంగా విదేశాల్లో వాడుతారు. తామరపువ్వుల్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. 
 
అందుకే తామరపువ్వుల రేకులతో గ్రీన్‌ టీ మాదిరిగా తాగితే గ్యాస్ట్రిక్‌ అల్సర్లు తగ్గడంతోబాటు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఆకుల్లోనూ బోలెడు పోషకాల్నాయి. తామర కాడల్లోనూ సి-విటమిన్‌ ఎక్కువ. తామర దుంపల్ని ఉడికించి తిన్నా, సూపులా తీసుకున్నా రక్తహీనత తగ్గుతుంది. నెలసరిలో రక్తస్రావం అధికంగా వుండే మహిళలకు ఇవి ఎంతో మేలు చేస్తుందట. 
 
తామర గింజల్లో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్-ఇ సమృద్ధిగా లభిస్తాయి. గింజల్లోని పాలీఫినాల్స్ మధుమేహ నియంత్రణకు తోడ్పడతుతాయి. గింజల్ని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి పంచదార కలిపి తాగితే డయేరియా తగ్గుతుందట. గింజల్ని పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పూలను కూడా డయేరియా, కలరా, జ్వరాలు తగ్గడానికి వాడతారు. 
 
మృదువైన చర్మసౌందర్యం కోసం తామర గింజలు, పువ్వుల రేకుల పౌడర్‍‌ను వాడుతారు. అలాగే తామర పువ్వుల తైలం మెలనిన్‌ ఉత్పత్తికి తోడ్పడటం ద్వారా తెల్లజుట్టుని నిరోధిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.