గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (18:07 IST)

తల్లిపాలతో సమానం-మేకపాలు.. జాతిపితకు చాలా ఇష్టమట (video)

మేకపాలుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ మేకపాలునే తాగేవారట. మేకపాలు తాగడం ద్వారానే ఆయన ఆరోగ్యంగా వుండగలిగారట. ఆవు, గేదె పాలకంటే మేకపాలలో కొన్ని ఔషధ గుణాలున్నాయి. మేకపాలు.. తల్లి

మేకపాలుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ మేకపాలునే తాగేవారట. మేకపాలు తాగడం ద్వారానే ఆయన ఆరోగ్యంగా వుండగలిగారట. ఆవు, గేదె పాలకంటే మేకపాలలో కొన్ని ఔషధ గుణాలున్నాయి. మేకపాలు.. తల్లిపాలతో సమానం అంటున్నారు... ఆయుర్వేద నిపుణులు.


మేకపాలతో అలర్జీలు దూరమవుతాయి. ఇందులోని ఆల్ఫా ఎస్ 1 తక్కువగా వుండటం ద్వారా మేకపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గేదె, ఆవు పాలతో 93 శాతం చిన్నారుల్లో అలెర్జీలు ఏర్పడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది.
 
కానీ మేకపాలుతో ఆ సమస్య లేదని, రాదని పరిశోధన తేల్చింది. ఇంకా మేకపాలలో లాక్టోస్ పంచదార శాతం చాలా తక్కువ. తద్వారా తేలిగ్గా జీర్ణమవుతుంది. ఎముకల అరుగుదలను మేకపాలు నివారిస్తుంది. ఆవుపాలలో 276 మి.గ్రాముల క్యాల్షియం వుంటే మేక పాలలో ఆ శాతం 327 మి.గ్రాముల వరకు వుంటుంది.

ఇది ఎముకలను ఆరోగ్యంగా వుంచుతుంది. రోజుకు మన శరీరానికి కావలసిన క్యాల్షియం ఒక కప్పు మేకపాలలోనే లభిస్తుంది. మేకపాలు గుండెకు మేలు చేస్తుంది.
 
శరీరంలోని కొవ్వు శాతాన్ని ఇది చాలామటుకు తగ్గిస్తుంది. మేకపాలు గుండెపోటు, పక్షవాతాన్ని నియంత్రిస్తుంది. ఇందులోని పొటాషియం.. హైబీపీని తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తినిచ్చే సెలీనియం మేకపాలలో పుష్కలంగా వున్నాయి.

తల్లిపాల వలె శ్రేష్ఠమైన మేకపాలలో ఫాస్పరస్, క్యాల్షియం, విటమిన్ బి, పొటాషియం, సెలీనియం వంటి ధాతువులున్నాయి. మేకపాలను రోజూ నీరు చేర్చి మరిగించి, కలకండ పొడిని కలిపి తీసుకుంటే కఫ వ్యాధులు దూరమవుతాయి. కాలేయ సమస్యలను మేకపాలు నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.