శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (11:52 IST)

హనుమంతునికి ఆవనూనె దీపం.. దానిమ్మ-ఆవుపాలు నైవేద్యంగా పెడితే?

ఆరోగ్యంగా వుండాలంటే.. ఆంజనేయ స్వామిని పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 41 రోజుల పాటు మండల దీక్ష చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ 41 రోజులు నిష్ఠతో పూజ చేసి... 41 రోజుల పాటు ఉదయం పూ

ఆరోగ్యంగా వుండాలంటే.. ఆంజనేయ స్వామిని పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 41 రోజుల పాటు మండల దీక్ష చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ 41 రోజులు నిష్ఠతో పూజ చేసి... 41 రోజుల పాటు ఉదయం పూట హనుమంతునికి ఆలయంలో ఆవనూనెతో దీపమెలిగించాలి. ఇలా 41 రోజుల పాటు మండల దీక్ష చేసి.. ముగిసిన తర్వాత హనుమంతునికి అర్చన చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలంటే..? సుందరకాండను పారాయణం చేయాలి. అష్టాదశపురాణాల తర్వాత అందరికీ మార్గనిర్దేశంగా నిలిచేది రామాయణం. ఈ రామాయణంలో వాల్మీకి మహర్షి గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు తీసుకుని.. అందులో వున్న ఒక్కో అక్షరం మీద వెయ్యి శ్లోకాలను చెప్పారు. ఈ శ్లోకాలు రామాయణంలో మనకు కనబడుతాయి. 
 
అందుకే రామాయణ పఠనం ద్వారా కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా సుందరకాండ పారాయణం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి ఎన్నో కష్టాలను దాటుకుని, సముద్రాన్ని దాటుకుని సీతమ్మను దర్శనం చేసుకున్నాడు.. సీతమ్మ శోకాన్ని లేకుండా చేశాడు. అదే తరహాలో సుందరకాండను పారాయణం చేసుకున్న వారికి ఈతిబాధలంటూ వుండవు.
 
సుందరకాండను 68 రోజుల పాటు పారాయణం చేస్తే చికాకులు, ఈతిబాధలు, వ్యాపారాల్లో నష్టాలు తొలగిపోతాయి. సుందరకాండను సప్త సర్గీ విధానంలో పారాయణ చేయాలి. అయితే సుందరకాండ పారాయణం చేసే ముందు, పారాయణం చేసిన తర్వాత దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టాలి. లేకుంటే ఆవుపాలను నైవేద్యంగా పెట్టాలి. 
 
ఇంకా రామచంద్రమూర్తి అష్టోత్తరాన్ని పారాయణ చేసి, దాని తర్వాత మాత్రమే సుందరకాండను పారాయణ చేయాలి. ఇలా రోజూ 7 సర్గల మేర సుందరకాండను పారాయణ చేస్తే.. సమస్యలు మాయమవుతాయి. అసాధ్యమనుకున్న పనులు కూడా సుసాధ్యమవుతాయని పండితులు సూచిస్తున్నారు.