రోజూ ఓ దానిమ్మను తింటే వడదెబ్బ తప్పించుకోవచ్చు..

ఆదివారం, 13 మే 2018 (15:09 IST)

రక్తాన్ని శుద్ధి చేసే గుణం పండులో ఉంది. ఈ పండు తింటే రక్తహీనత నుంచి సునాయాసంగా బయటపడొచ్చు. రోజు ఒక దానిమ్మ పండు తినడం ద్వారా వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. దానిమ్మలోని విటమిన్‌ సీ, ఈ ,కే, బి1, బీ2 విటమిన్లు, ఫైబర్‌ దానిమ్మలో మెండుగా లభిస్తాయి. అందుకే ఏ కాలంలోనైనా దానిమ్మ పండు తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచించారు. 
 
దానిమ్మలలో ఉన్న ఐరన్, హీమోగ్లోబిన్ స్థాయిలను రక్తహీనతని సరిచేయడానికి పనిచేస్తాయి. పైల్స్ చికిత్సకు దానిమ్మపండు చాలా ప్రభావవంతమైనది. రక్తస్రావం పైల్స్‌ను ఎండిన దానిమ్మ పొడిని ఒక టీస్పూన్ తీసుకోవాలి. దానిమ్మ గింజలు, దానిమ్మ గింజల రసం గుండెకు మంచి టానిక్ లాంటిది. గుండె వ్యాధుల నివారణకు దానిమ్మ చాలా మంచిది అని చాలా సార్లు రుజువయ్యింది. 
 
దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడలపై కొవ్వు పెరుకుపోవాదాన్ని అడ్డుకుంటాయి. ఇది గుండెకు మాత్రమే కాకుండా కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. బీపీ ఉన్న పేషెంట్లకు దానిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
దానిమ్మ శరీరంలోని సహజసిద్దమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మను తరచూ తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ సాఫీగా జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజూ నాలుగేసి మామిడి ముక్కలను తీసుకుంటే?

వేసవిలో పుష్కలంగా లభించే మామిడి పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. ...

news

కాలేయానికి ఇన్ఫెక్షన్లు సోకకుండా వుండాలంటే? పసుపును?

పాలకూర, తోటకూర తింటే కాలేయ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ...

news

ధ్యానం వల్ల కలిగే మేలు...

మానవుని మెదడు అనంతమైన విశ్వానికి ప్రతినిధి. శరీర క్రియలను మెదడు నియంత్రిస్తుంది. మనిషి ఒక ...

news

గర్భిణీ మహిళలు కరివేపాకు పొడిని అన్నంలో వేసుకుని తింటే?

కరివేపాకు ద్వారా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బీ, కెరోటిన్ వంటి ...

Widgets Magazine