మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (20:41 IST)

గుండె పనితీరును మెరుగుపరిచే పసుపు

పసుపు.. ప్రతి ఇంట్లోని వంటింట్లో ఉండేది. ఆయుర్వేదం చికిత్సలో వాడేది. అలాంటి పసుపుతో ఉపయోగాలు అనేకం. ముఖ్యంగా, హృద్రోగుల్లో గుండె పనితీరు మెరుగుపర్చేందుకు సంప్రదాయ ఔషధం. 
 
గుండె జబ్బు గల ఎలుకలకు 12 వారాలపాటు రోజూ కొంత పసుపు అందించారు. వీటి గుండె పనితీరు ఆరోగ్యవంతమైన ఎలుకల మాదిరిగా మెరుగవ్వడాన్ని గుర్తించామన్నారు. హృద్రోగుల్లో రక్తాన్ని ఇతర శరీర భాగాలకు పంపే ఎడమ జఠరిక పనితీరును ఈ పసుపు పెంచుతుందని అమెరికాలోని నెబ్రాస్కా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అందువల్ల పసుపును తీసుకుంటే గుండె జబ్బులకు దూరం కావచ్చు.