శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: ఆదివారం, 15 అక్టోబరు 2017 (20:09 IST)

ఈ ఒక్క ఆకు తింటే ఏనుగుతో సమానమైన బలం...

మనలో చాలామంది కనీస శరీర బలం లేకుండా బతుకులను భారంగా ఈడుస్తుంటారు. బలం కోసం ఏవేవో మందులు తాగుతుంటారు. అయినా ఉపయోగం ఉండదు. అలాంటి వారు సునాముఖి ఆకులను మెత్తగా దంచి జల్లెడ పట్టి నిలువ చేసుకుని క్రమబద్ధంగా వాడుకోవడం ప్రారంభిస్తే తిరిగి కోరుకున్న బలాన్ని

మనలో చాలామంది కనీస శరీర బలం లేకుండా బతుకులను భారంగా ఈడుస్తుంటారు. బలం కోసం ఏవేవో మందులు తాగుతుంటారు. అయినా ఉపయోగం ఉండదు. అలాంటి వారు సునాముఖి ఆకులను మెత్తగా దంచి జల్లెడ పట్టి నిలువ చేసుకుని క్రమబద్ధంగా వాడుకోవడం ప్రారంభిస్తే తిరిగి కోరుకున్న బలాన్ని పొందవచ్చు.
 
సునాముఖి ఆకులనే కొన్ని ప్రాంతాలను తంగేడు ఆకులు అంటారు. ఈ ఆకుల గురించి గ్రామ ప్రజలకు బాగా తెలుసు. ఈ చెట్లు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతాయి. సునాముఖి ఆకులను మెత్తగా దంచి జల్లెడ పట్టి నిలువ చేసుకుని క్రమబద్ధంగా రోజూ సునాముఖి పొడిని రెండు నుంచి మూడు గ్రాములు మంచి నీళ్లలో కలుపుకుని అందులో తేనెను కలిపి సంవత్సరం పాటు నిద్రించే ముందు తాగితే ఏనుగుతో సమానమైన శారీరక బలం సిద్ధిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.