శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (13:04 IST)

డైటింగ్ చేసేవారు రూజో పండ్లు, సలాడ్స్ తీసుకుంటే...

ఇపుడు చాలా మంది నాజూకుతనం కోసం డైటింగ్‌లు చేస్తున్నారు. దీంతో సమయానికి ఏదో ఒకటి ఆరగిస్తున్నారు. ముఖ్యంగా, ఫాస్ట్‌ఫుడ్స్‌వను ఇష్టానుసారంగా లాగించేస్తున్నారు. దీంతో డైటింగ్ సంగతి దేవుడెరుగ.. మరింత బొద్దుగా మారిపోతున్నారు. 
 
నిజానికి డైటింగ్ చేయదలచినవారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా, మహిళలు మహిళలు ఎక్కువ సార్లు మోతాదులో తినడం మంచిది. రెండు మూడు గంటలకు ఓసారి ఏదో ఒకటి తినండి. అదికూడా వేగంగా నోట్లో కుక్కేయకుండా మెల్లగా రుచిని ఆస్వాదిస్తూ తింటే కడుపు నిండుతుంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవద్దు. 
 
ఉదాహరణకి పండ్లరసాల కన్నా పండు తినడం మేలు. రోజుకి నాలుగైదు సార్లు పండ్లు, సలాడ్స్ తీసుకోవడం మంచిది. కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల కన్నా ప్రోటీన్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారం జోలికి వెళ్లవద్దు. నీళ్లు సరిపడా తాగడం మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.