గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By selvi
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (12:48 IST)

నెలసరి సమయాల్లో మహిళలు చేపలు, చికెన్ తినాల్సిందే..

నెలసరి సమయంలో రోజు వారీ ఆహారంతో పాటు ఆకుపచ్చని ఆకుకూరలు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. శాకాహారులు బెల్లం, నువ్వులుండలు, వేయించిన వేరుశెనగలు, అటుకులు తీసుకోవాలి. వంటల్లో వీటిని అధికంగా చేర్చ

నెలసరి సమయంలో రోజు వారీ ఆహారంతో పాటు ఆకుపచ్చని ఆకుకూరలు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. శాకాహారులు బెల్లం, నువ్వులుండలు, వేయించిన వేరుశెనగలు, అటుకులు తీసుకోవాలి. వంటల్లో వీటిని అధికంగా చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. టాక్సిన్లు తొలగిపోతాయి. 
 
అలాగే మాంసాహారులైతే.. నెలసరి సమయాల్లో మహిళలు చేపలు, చికెన్‌తో పాటు లివర్‌ను ప్రత్యేకంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక మహిళల డైట్‌లో కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. 
 
అలాగే ఐరన్, విటమిన్ సి ఎక్కువగా వుండే తాజా పండ్లు, నిమ్మ, జామ, నారింజ పండ్లను తీసుకోవాలి. నెలసరి సమయంలో మహిళలు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగడం మరచిపోకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.