1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (17:22 IST)

మహిళలు తినాల్సిన తినకూడని పండ్లు ఏవి?

మహిళలు కానీ పురుషులు కానీ నారింజ, ఆపిల్, బత్తాయి, బొప్పాయి ఏదైనా ఒక పండు అల్పాహారానికి మధ్యాహ్న భోజనానికి మధ్య తీసుకోండి. అయితే మామిడి, సపోటా, అరటి పండ్లు, సీతాఫలం.. వంటి వాటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లు కాబట్టి తక్కువగా తీసుకోవడం లేదా...  సాధ్యమైనంత వరకు తీసుకోకపోవడం మంచిది. 
 
ఇక స్థూలకాయం, షుగర్‌ను నియంత్రించాలంటే లో క్యాలెరీ గల ఆహారాన్ని తీసుకోవాలి. కార్బోహైడ్రేడ్లు కలిగిన అన్నం కంటే గోధుమలతో తయారైన వంటకాలను తీసుకోవాలి. మాంసకృత్తులు లెక్కకొస్తే 20 నుంచి 30 శాతం క్యాలరీల శక్తి వచ్చేట్లు చూసుకోవాలి. కొవ్వు పదార్థాలయితే 20-25 శాతం ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.