1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (17:11 IST)

వ్యాధులను దూరం చేసుకోవాలా? చాక్లెట్ తినండి!

అవునండి.. వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే తప్పకుండా చాక్లెట్ తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాక్లెట్ల ఎంపికలో మాత్రం కాస్త జాగ్రత్త పాటించాలి. డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోవాలి. 
 
ఫాట్ లేకుండా చూసుకోవాలి. చాక్లెట్స్ తీసుకుంటే గుండె వ్యాధులు దరిచేరవు. రోజూ ఒక చాక్లెట్ బార్ తీసుకుంటే తప్పకుండా గుండె సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చు. 
 
ఇంకా చాక్లెట్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.. 
* చాక్లెట్ రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులోని ఆంటియాక్సిడెంట్లు రక్తపోటును నియత్రిస్తుంది.
* కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
* నిరుత్సాహన్ని నిరోధిస్తుంది
* వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. 
* గర్భస్థ శిశువుకు మేలు చేస్తుంది. 
* ఆయుష్షు పెరుగుతుంది.