గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శనివారం, 27 డిశెంబరు 2014 (18:06 IST)

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తీసుకోవాల్సిందే!

మహిళలు ఎముకల పటిష్టత కోసం క్యాల్షియం అధికంగా కలిగిన ఫుడ్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత పాల ఉత్పత్తుల్లో చీజ్, కాటేజ్ చీజ్, పెరుగు వంటివి తీసుకోవడం ఉత్తమం. అలాగే ఆరెంజ్‌లో అత్యధిక విటమిన్ సి తో పాటు శరీరానికి కావల్సిన కాల్షియం కూడా లభిస్తుంది. అందుచేత రోజుకు రెండు ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
రొయ్యలు వంటి సీఫుడ్స్‌తో పాటు సాల్మన్ ఫిఫ్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. సాల్మన్‌లో మినిరల్స్ సెలైన్ వాటర్‌లో కరిగి, కలిసిపోతాయి. కాబట్టి సాల్మన్ ఫిష్‌ను తరచూ ఆహారంతో పాటు తీసుకోవాలి.
 
ఇక మహిళల గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఓట్ మీల్ తీసుకోండి. గుండెను పదిలం చేసుకోవడానికి, శరీరానికి కావల్సిన ఫైబర్‌ను ఎక్కువగా అందించడానికి ఇది చాలా సహాయపడుతుంది. అంతే కాదు ఇది కొంత వరకూ క్యాల్షియాన్ని కూడా శరీరానికి అందిస్తుందని, బ్రేక్ ఫాస్ట్‌గా దీనిని తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.