శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:15 IST)

నల్లద్రాక్షలతో ముఖాన్ని మర్దనా చేసుకుంటే?

చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా తయారుచేసే హెర్బల్ ఫేస్ ప్యాక్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని ఇంట్లోనే క్షణాల్లో తయారుచేసుకోవచ్చును. వీటివలన సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు. పైగా చర్మం పట్టులా కాంతివంతంగా, మృదువుగా

చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా తయారుచేసే హెర్బల్ ఫేస్ ప్యాక్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని ఇంట్లోనే క్షణాల్లో తయారుచేసుకోవచ్చును. వీటివలన సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు. పైగా చర్మం పట్టులా కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
నల్లద్రాక్షాలతో ముఖాన్ని మర్దన చేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ ద్రాక్షాలను పేస్ట్‌లా చేసుకుని కూడా ముఖానికి రాసుకోవచ్చును. కీరా రసంలో గ్లిజరిన్, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. 
 
గంధపు పొడిలో కొద్దిగా పాలు, పసుపును కలుపుకుని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. తద్వారా మెుటిమలు కూడా తొలగిపోతాయి. పాలలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 
 
15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా టమోటో రసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. ముఖం పై ఉన్న అవాంఛనీయ రోమాలు పోవాలంటే గోధుమపిండిలో కొద్దిగా పసుపు, నువ్వుల నూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.