Widgets Magazine

వెనిగర్, ఆలివ్ నూనె కలిపి క్రీములా చర్మానికి రాసుకుంటే..

వెనిగర్, ఆలివ్ నూనె కలిపి క్రీములా చర్మానికి రాసుకుంటే.. చర్మం బిగుతుగా... కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ నూనె, తేనె కలిపి చర్మానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. చర్మానికి కొత్త కాంతి లభిస్తుంది.

selvi| Last Updated: సోమవారం, 1 జనవరి 2018 (17:20 IST)
వెనిగర్, ఆలివ్ నూనె కలిపి క్రీములా చర్మానికి రాసుకుంటే.. చర్మం బిగుతుగా... కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ నూనె, తేనె కలిపి చర్మానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. చర్మానికి కొత్త కాంతి లభిస్తుంది.

గులాబీలు, తామర, చామంతీ పువ్వులను ముద్దగా పేస్టులా చేసుకుని.. చర్మానికి పూతలా వేసుకుంటే.. చర్మంపై వున్న ముడతలు తొలగిపోతాయి. ఈ పూతల వల్ల చర్మం బిగుతుగా మారి, రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. సీ సాల్ట్, పంచదార, ఆలివ్‌ నూనె కలిపి ఒంటికి పట్టించుకుంటే, మృతకణాలు తొలగిపోతాయి.

అర చెంచా ముల్తానీ మట్టిలో అరచెంచా పాలపొడి, దానిమ్మరసం చెంచా, గులాబీ రేకుల రసం ఒక స్పూన్, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

దీనిపై మరింత చదవండి :