ఉప్పును ఇలా కూడా వాడొచ్చు..

ఉప్పును వంటల్లో చేర్చడమే కాకుండా సౌందర్య పోషణకు కూడా ఉపయోగించవచ్చు. మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసనను పోగొట్టేందుకు క్లెన్సర్‌గా ఉప్పు ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు

selvi| Last Updated: శనివారం, 30 డిశెంబరు 2017 (12:22 IST)
ఉప్పును వంటల్లో చేర్చడమే కాకుండా సౌందర్య పోషణకు కూడా ఉపయోగించవచ్చు. మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసనను పోగొట్టేందుకు క్లెన్సర్‌గా ఉప్పు ఉపయోగపడుతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి.

రాళ్ల ఉప్పుని కొన్ని నీళ్లలో కలుపుకుని.. స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకుని.. ముఖంపై స్ప్రే చేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.


అలాగే కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే తగ్గిపోవాలంటే... గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకోవాలి. నీళ్లలో ముంచిన దూదిని తీసుకుని కళ్ల మీద పెట్టుకోవాలి. ఉప్పు, లవంగనూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. కాసేపటి తర్వాత స్నానం చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది.


దీనిపై మరింత చదవండి :