శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (16:02 IST)

బాదం నూనెను ప్రతిరోజూ తలకు పట్టిస్తే..

బాదం నూనెను ప్రతిరోజూ మాడుకు, వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు మెరిసిపోతుంది. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. అందుచేత రోజూ బాదం నూనెను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బాదం నూనెలో విటమిన్ ఇ

బాదం నూనెను ప్రతిరోజూ మాడుకు, వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు మెరిసిపోతుంది. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. అందుచేత రోజూ బాదం నూనెను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. అలాగే కొబ్బరినూనె కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టును వత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. 
 
ఇంకా జుట్టు సంరక్షణలో ఆలివ్ ఆయిల్ మెరుగ్గా పనిచేస్తుంది. మాడుకు తేమనిస్తుంది. చుండ్రును దూరం చేస్తుంది. ఒత్తైన నల్లని జుట్టు పొందాలంటే.. మస్టర్డ్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు.  ఈ ఆయిల్ తలలో బ్లడ్ సర్కులేషన్ ను పెంచి జుట్టు పెరగడానికి సహాయంచేస్తుంది. 
 
జుట్టు సంరక్షణకు నువ్వులనూనెను ఉపయోగించడం ఎంతో మేలు చేస్తుంది. వారానికోరోజు నువ్వులనూనెతో తలకు మసాజ్ చేస్తే.. తలలో రక్త ప్రసరణ పెరిగి జుట్టు పెరగడం ప్రారంభమవుతుందని బ్యూటీషియన్లు చెప్తున్నారు.