ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:42 IST)

శెనగపిండి, ఉప్పుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?

బంగాళాదుంప మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. కమలాపండు రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 2

బంగాళాదుంప మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. కమలాపండు రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
 
కీరదోస మిశ్రమంలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేసుకుంటే ముఖంపై గల వెంట్రుకలు తొలగిపోతాయి. 
 
నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. బాదం పప్పు మిశ్రమంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.