1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (12:24 IST)

పుదీనా మిశ్రమంలో పసుపు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

పుదీనా ఆకులను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని ఆ మిశ్రమంలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివ

పుదీనా ఆకులను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని ఆ మిశ్రమంలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. తద్వారా ముఖంపై గల మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
 
పుదీనా ఆకుల మిశ్రమంలో గుడ్డు తెల్లసొనను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కింద గల నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. పుదీనా ఆకులతో నూనెను తయారుచేసుకుని తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.