శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (12:29 IST)

టామోటా గుజ్జును ముఖానికి రాసుకుంటే?

టమోటాను గుజ్జులా చేసుకుని ముఖానికి రాసుకుంటే ముఖం తేమను కోల్పోకుండా ఉంటుంది. తద్వారా ముఖం కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినూనెను కొద్దిగా వేడి చేసుకుని ఆ నూనెతో శరీరాన్ని మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తర

టమోటాను గుజ్జులా చేసుకుని ముఖానికి రాసుకుంటే ముఖం తేమను కోల్పోకుండా ఉంటుంది. తద్వారా ముఖం కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినూనెను కొద్దిగా వేడి చేసుకుని ఆ నూనెతో శరీరాన్ని మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది.
   
 
కీరదోసను పేస్ట్‌లా చేసుకుని ఆ మిశ్రమంలో కొద్దిగా కొబ్బరినూనెను వేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై గల మెుటిమలు తొలగిపోతాయి. గులాబీ రేకులను పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకుంటే కంటి కిందంటి నల్లటి వలయాలు తొలగిపోతాయి.