ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (12:07 IST)

తులసి ఆకులు, పసుపుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

తులసి ఆకులు ఆరోగ్యానికి కాదు అందానికి కూడా చాలా ఉపయోగపడుతాయి. తులసి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మెుటిమలను తొలగించుటకు దోహదపడుతాయి.

తులసి ఆకులు ఆరోగ్యానికి కాదు అందానికి కూడా చాలా ఉపయోగపడుతాయి. తులసి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మెుటిమలను తొలగించుటకు దోహదపడుతాయి. ఈ ఆకులను ఎలా వాడాలంటే.. తులసి ఆకులను ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
 
అలానే వేపాకులను పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.  అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన ముఖం మెుటిమలు తొలగిపోయి కాంతివంతంగా, తాజాగా మారుతుంది. 
 
వేడినీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. దీంతో ముఖం మృదువుగా మారుతుంది. దోసకాయతో రకరకాల వంటకాయు చేస్తుంటారు. వీటితో అందానికి కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 
 
దోసకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలుపుకువు ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి మఖం మృదువుగా మారుతుంది.