1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:24 IST)

పాదాల పగుళ్లకు.. నువ్వుల నూనె రాసుకుంటే..?

నీళ్లల్లో ఎక్కువగా పనిచేసే వారిలో అరిచేతులు, పాదాలు పాచినట్లువుతాయి. అంతేకాకుండా పాదాలు పగుళ్లు, పాచినట్లు ఉంటాయి. ఈ ప్రాంతాలలో సబ్బులు, వంటసోడా తగిలినా కూడా ఈ సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా సబ్బు నీటి

నీళ్లల్లో ఎక్కువగా పనిచేసే వారిలో అరిచేతులు, పాదాలు పాచినట్లువుతాయి. అంతేకాకుండా పాదాలు పగుళ్లు, పాచినట్లు ఉంటాయి. ఈ ప్రాంతాలలో సబ్బులు, వంటసోడా తగిలినా కూడా ఈ సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా సబ్బు నీటిలో ఎక్కువగా ఉంటే పాదాలు పగుళ్ల నుండి రక్తం, చీము కారుతుంది. దాంతో పాదాలు దురదలుగా ఉంటాయి. ఈ సమస్యలు తొలిగిపోవాలంటే ఇలా చేస్తే చాలు..
 
నీటిలో పనిచేసిన తరువాత పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మెత్తటి గుడ్డతో తడిని పూర్తిగా తుడుచుకుని పాదాలకు ఆముదం లేదా నువ్వులనూనెను రాసుకుని మర్దన చేసుకోవాలి. అలానే వేపాకులను నీటిలో మరిగించుకుని ఆ నీళ్లల్లో పాదాలను 10 నిమిషాల పాటు ఉంచుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
మాను పసుపును కషాయంగా చేసుకుని ప్రతిరోజూ రెండుపూటలా తీసుకుంటే పాదాలను ఇన్ఫెక్షన్స్ రావు. అలాకాకుంటే పసుపుని గంధంలా చేసుకుని పాదాలను రాసుకుంటే కూడా మంచిదే. నెయ్యి ఆరోగ్యానికి కాదు పలురకాల ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. అంటే నెయ్యిలో కొద్దిగా తేనె కలుపుకుని పాదాలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకుంటే మంచిది.
 
నువ్వుల నూనెను వేడిచేసుకుని కొద్దిగా తేనె, మైనం ముక్కలు వేసి కరిగించుకోవాలి. కాసేపటి తరువాత దించుకుని పాదాలకు, అరచేతులకు రాసుకుని గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన పాదాలు, అరిచేతులు ఆరోగ్యంగా ఉంటాయి.