బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (13:32 IST)

పెరుగు, కాఫీ పొడితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే...

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులోని మంటను తగ్గించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులోని మంటను తగ్గించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిని మజ్జిగ రూపంలో తీసుకుంటే ఒత్తిడి, అలసట వంటి సమస్యలు తొలగిపోతాయి. పెరుగుతో అందానికి గల చిట్కాలు తెలుసుకుందాం.
 
పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం తాజాగా మారుతుంది. పెరుగులో కొద్దిగా గుడ్డు తెల్లసొన, ఉప్పు, చక్కెర కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
పెరుగులో కొద్దిగా కాఫీ పొడి, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. దాంతో మెుటిమలు, నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి. పెరుగులో బియ్యపు పిండి, బాదం నూనె కలిలి పేస్ట్‌ళా తయారుచేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.