శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (11:35 IST)

మిరియాల పొడి తేనె, పసుపు కలిపిన నీటిని తీసుకుంటే..?

మిరియాలలో క్యాల్షియం, విటమిన్స్, బీటా కెరోటిన్, అమినో యాసిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచివి.

మిరియాలలో క్యాల్షియం, విటమిన్స్, బీటా కెరోటిన్, అమినో యాసిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో మసాలాలు, టీలు, పులావ్ వంటి వంటకాలు తయారుచేసుకుంటారు. మిరియాలు పొడి తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. జలుబు చేసినప్పుడు కొందరికి గొంతు గరగరా ఉంటుంది.
 
అలాంటప్పుడు పాలలో కొద్దిగా మిరియాల పొడి, పసుపు, తేనె కలుపుకుని తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుంది. శరీరంలోని కొవ్వును కరిగించుటకు మిరియాలు రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దంత సమస్యలతో బాధపడేవారు తరచుగా మిరియాల పొడిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. 
 
ఈ నీటిని ఎలా తయారుచేయాలంటే ఒక చిన్నగిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని అందులో మిరియాల పొడి, ఉప్పు, ఇంగువ, పసుపు వేసుకుని బాగా మరిగించుకోవాలి. చల్లారిన తరువాతు తీసుకుంటే మంచిది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు మిరియాల పొడిలో కొద్దిగా శొంఠి పొడి, తేనె కలుపుకుని నీటిలో మరిగించి తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.