Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్నానానికి ముందు గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకుంటే....?

శుక్రవారం, 30 జూన్ 2017 (14:46 IST)

Widgets Magazine

భుజాలు, కాళ్లపైన చర్మం వాతావరణ మార్పు వల్ల నలుపుగా మారుతుంది. దీనికి కొబ్బరి నూనె లేదా బాదం నూనె చర్మాన్నిమృదువుగా మార్చడమే కాకుండా నల్లని చర్మం నుండి విముక్తి కలిగిస్తుంది. కొబ్బరి నూనె, కొంచెం నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి మర్ధన చేసుకోవాలి. రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, ఐదు నిమిషాలు తర్వాత శనగపిండితో కడిగితే నలుపు రంగు క్రమంగా తగ్గుతూ వస్తుంది. 
 
టమోటో రసం లేదా దానిమ్మ రసం తేనె కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, శుభ్రపరుచుకుంటే నలుపు సులువుగా తగ్గుతుంది. నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికి ఒకసారి నలుగు పిండిలో నువ్వుల నూనె కలిపి వల్ల చర్మానికి పట్టిస్తే కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ లభించి, మృదువుగా కోమలంగా మారుతుంది. రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.
 
పెరుగులో కొద్దిగా నిమ్మరసం, శెనగపిండి కలిపి నలుపుగా ఉన్నచోట రాసి, గోరు వెచ్చని నీటితో కడిగితే చర్మానికి నిగారింపు వస్తుంది. పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి. రోజూ స్నానానికి ముందు గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో కొద్దిగా పెసరపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని నల్లంగా ఉన్నచర్మంపై పూతలా పూయాలి. అరగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకుంటే నలుపు రంగు తగ్గుతూ వస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

చినుకులు పడుతున్నాయ్.. చర్మ సంరక్షణ ఇలా...?

చినుకులు పడుతున్నాయ్. చర్మాన్ని ఇలా సంరక్షించుకోవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. ...

news

కర్బూజ పండుతో చర్మ సౌందర్యం.. ఫేస్ డల్‌గా ఉంటే?

కర్బూజ పండులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో పాటు సౌందర్యాన్నిచ్చే గుణాలు కూడా పుష్కలంగా ...

news

కంటి చుట్టూ వలయాలను దూరం చేసుకోవాలంటే? అరటి పండే చాలు..

కంటి చుట్టూ వలయాలను దూరం చేసుకోవాలంటే.. అరటి పండే సరిపోతుందని బ్యూటీషన్లు అంటున్నారు. ...

news

పెదవులు నల్లగా మారిపోతే.. గులాబీ రేకులతో ఇలా చేయండి..

పెదాలు నల్లగా మారి ఇబ్బందిగా కనిపిస్తున్నప్పుడు గులాబీ పూల పూత వేసుకుంటే మంచి ఫలితం ...

Widgets Magazine