శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (13:35 IST)

జుట్టు పోషణకు పొన్నగంటి కూర..

జుట్టు పోషణకు పొన్నగంటి కూర ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు పొన్నగంటి కూర, ఒక కప్పు గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మ

జుట్టు పోషణకు పొన్నగంటి కూర ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు పొన్నగంటి కూర, ఒక కప్పు గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 20 నిమిషాల సేపు ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
చుక్కకూర ఒక కప్పు, గోరింటాకు పొడి, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టి, కప్పు పెరుగు కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. దానిని తలకు బాగా పట్టించి 20 నిమిషాల సేపు ఉంచాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడుతుంది. 
 
ఇంకా కొద్దిగా మజ్జిగలో చింత చిగురు, కప్పు గోరింటాకు పొడి, అరకప్పు శనగపిండి కలపాలి. తలకు బాగా నూనె రాసుకుని ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
 
అలాగే ఉల్లిపాయలను మెత్తగా దంచి పలుచని నూలుబట్టలో వేసి రసం తీసి వారానికి రెండు సార్లు తలకు సున్నితంగా మర్దనా చేస్తుంటే తలలో మాటి మాటికీ వెంట్రుకలు ఊడడం ఆగిపోవడమే కాక కుదుళ్లు కూడా గట్టిపడతాయి.